ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏఐ ప్లస్ క్యాంపస్ ఏర్పాటు ఉన్నత విద్యను సమూలంగా మార్చే నిర్ణయమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దీనికి ముందుకొచ్చిన ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్, కుమారమంగళం బిర్లాకు ఆయన సోషల్ మీడియా’ఎక్స్’ లో కృతజ్ఞతలు తెలిపారు. ‘ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ను ఏఐ బేస్డ్ విద్యా విప్లవానికి కేంద్రంగా మార్చే దిశగా గొప్ప ముందడుగని చంద్రబాబు పోస్టు చేశారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కూడా దీనిపై స్పందించారు. బిట్స్ కొత్త క్యాంపస్ ను అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు ఆదిత్య బిర్లా గ్రూపు ఛైర్మన్ కుమారమంగళం బిర్లా చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ లో పోస్టు చేశారు. రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో నెలకొల్పనున్న ఈ క్యాంపస్ లో 7 వేల మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారని పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు