మన రాజ్యాంగం దేశ ప్రజలందరికీ గౌరవప్రదంగా, స్వేచ్ఛగా జీవించే హక్కును కల్పించిందని వాటికి భంగం కలగకుండా అందరూ నడుచుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తెలిపింది. ఒకరి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇతరులు హాక్కులకు భంగం కలిగించకూడదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కొన్ని పదాలు, తీవ్రమైన వ్యాఖ్యలను నివారించేలా మార్గదర్శకాలు రూపొందించాలని, అదే సమయంలో భావ వ్యక్తీకరణ, వాక్ స్వాతంత్య్రం, పౌరుల ప్రాథమిక విధులకు భంగంకలిగించని విధంగా సమతుల్యతనూ పాటించాలనీ కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణికి స్పష్టం చేసింది. వెన్నెముక కండర సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న, చూపులేని దివ్యాంగులను పరిహసించారనే కేసులో ఆరోపణలున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అయిదుగురు తాజాగా సుప్రీంకోర్టు ఎదుట హాజరయ్యారు. అభియోగాలకు రెండు వారాల్లోగా సమాధానాలివ్వాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి ధర్మాసనం వారిని ఆదేశించింది. తదుపరి విచారణకు కూడా తప్పనిసరిగా హాజరుకావాలని ఇన్ఫ్లుయెన్సర్లను హెచ్చరించింది. సోషల్ మీడియాలో తరచూ వివాదాలకు కారణమవుతున్న పోస్టులను ప్రస్తావిస్తూ వాటి కట్టడికి మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.
అందరికీ సమాన హక్కులు…వాటికి భంగం కలగకుండా అందరూ నడుచుకోవాలి: సుప్రీంకోర్టు
By admin1 Min Read