ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం మరింత మద్దతు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏపీలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, పోలవరం ప్రాజెక్టు, గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి అంశాలతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం నుండి అదనపు నిధుల కోసం చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. ఇక ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా పాల్గొన్నారు. రాష్ట్ర విభజన కారణంగా ఏపీకి జరిగిన ఆర్థిక నష్టాలను 16వ ఆర్థిక సంఘం దృష్టిలో ఉంచుకుని నిధుల కేటాయింపులో పరిగణనలోకి తీసుకోవాలని చంద్రబాబు కోరారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు