ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకుని ఆయుధ సంపత్తిని భారత్ పెంపొందించుకుని దూసుకెళ్తోంది. తాజాగా దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాశ్ ప్రైమ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ ను భారత సైన్యం విజయవంతంగా పరీక్షించింది. నిన్న లడఖ్ లో సముద్రమట్టానికి 15 వేల అడుగుల ఎత్తులో భారత ఆర్మీ గగనతల లక్ష్యాలను ఛేదించే ఆకాశ్ ప్రైమ్ మిస్సైల్ ను విజయవంతంగా పరీక్షించింది. ఈ మిస్సైల్ ను అభివృద్ధి చేసిన రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) సీనియర్ అధికారుల సమక్షంలో ఈ ప్రయోగ పరీక్షలు పూర్తయ్యాయి. దీంతో భారత సైనిక దళాల వైమానిక రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించే విధంగా మరో కీలక విజయాన్ని సాధించినట్లయింది.ఇక ఇంతకు ముందు ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ ప్రయోగించిన డ్రోన్లు, మిస్సైల్స్ ను ఆ ఆకాశ్ ప్రైమ్ మిసైల్ ఖచ్చితత్వంతో విజయవంతంగా అడ్డుకుని ఎంత సమర్థవంతంగా పని చేస్తుందనేది నిరూపించుకుంది.
ఆకాశ్ ప్రైమ్ మిసైల్ సిస్టమ్ ను విజయవంతంగా పరీక్షించిన భారత సైన్యం
By admin1 Min Read
Previous Articleహిందీ భాషను నేర్చుకోవడంలో తప్పు లేదు: వైసీపీ అధినేత జగన్
Next Article 150కిపైగా దేశాలపై 10 లేదా 15 శాతం టారిఫ్ లు