టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీలో భాగంగా మాంచెస్టర్ వేదికగా భారత్- ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. రవీంద్ర జడేజా (103*; 185 బంతుల్లో 12 ×4), వాషింగ్టన్ సుందర్ (101*; 206 బంతుల్లో 9 ×4, 1×6) సెంచరీలు చేసి భారత్ ను ఓటమి నుండి తప్పించారు. కెప్టెన్ శుభ్ మాన్ గిల్ (103; 12×4) కూడా సెంచరీతో రాణించాడు. కేఎల్ రాహుల్ (90; 230బంతుల్లో 8×4) సెంచరీకి చేరువగా వెళ్లాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 358, ఇంగ్లాండ్ 669 పరుగులకు ఆలౌటయ్యాయి. రెండో ఇన్నింగ్స్లో భారత్ 425/4గా నిలిచింది. మ్యాచ్ డ్రాగా ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. మ్యాచ్ ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో 10ఓవర్లు మిగిలుండగానే మ్యాచ్ ను డ్రాగా ముగించేందుకు రెండు జట్లు అంగీకరించాయి.
డ్రా గా ముగిసిన మాంచెస్టర్ టెస్టు: సెంచరీలతో అదరగొట్టిన జడేజా, వాషింగ్టన్ సుందర్
By admin1 Min Read