హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ విజువల్ ఫీస్ట్ ‘అవతార్’ సిరీస్‌లో పార్ట్-3 ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌ను జులై 25న ‘ది ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్’ సినిమాతో పాటు థియేటర్లలో ప్రదర్శించారు. పండోరా గ్రహంపై అగ్ని నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులను మరోసారి తన ప్రపంచం లోకి తీసుకెళ్లనుంది. తాజా గా ఈ ట్రైలర్ ను అవతార్ ఫ్రాంచైజీ తన సోషల్ మీడియా ఎకౌంట్ లో పంచుకుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌లో బ్రిటిష్ నటి ఊనా చాప్లిన్ పోషించిన ‘వరంగ్’ పాత్రను పరిచయం చేశారు, ట్రైలర్ అగ్ని, బూడిద థీమ్‌ను ప్రతిబింబిస్తూ, సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఈ విజువల్ ఫీస్ట్ ప్రేక్షకులను అలరించనుంది.
From Director James Cameron, watch the trailer for Avatar: Fire and Ash.
Experience the film only in theaters December 19. pic.twitter.com/Y0D4EUGU7x
— Avatar (@officialavatar) July 28, 2025