సింగపూర్ పర్యటనలో భాగంగా రెండో రోజు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ – సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్, సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పారిశ్రామికవేత్తలు ఒకసారి ఎంఓయుపై సంతకం చేశాక… ఆ ప్రాజెక్టు పూర్తి బాధ్యత తమదేనని మంత్రి లోకేష్ అన్నారు. ఆ తర్వాత ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు, సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. అర్బన్ ప్లానింగ్ గవర్నెన్స్, అర్బన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లో ఏపీ ప్రభుత్వం… సింగపూర్ సహకారాన్ని కోరుకుంటున్నట్లు వివరించారు. ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో పరిశ్రమదారులకు మద్దతుగా నిలుస్తామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.
టువాస్ పోర్టును సందర్శించిను ఏపీ సీఎం చంద్రబాబు బృందం:
ఆసియాలోనే రెండో అతి పెద్ద కంటైనర్ టెర్మినల్ పోర్టుగా టువాస్ పోర్టును సింగపూర్ ప్రభుత్వం నిర్మిస్తోంది. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధికి, పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని లోకేష్ పేర్కొన్నారు. ఈ క్రమంలో సింగపూర్ ప్రభుత్వం నిర్మిస్తున్న అతిపెద్ద టువాస్ పోర్టును సందర్శించి అధ్యయనం చేశారు. టువాస్ పోర్టు సందర్శనలో భాగంగా సీఎం చంద్రబాబుతో కలిసి పోర్ట్ ఆఫ్ సింగపూర్ అథార్టీ రీజనల్ సీఈఓ విన్సెంట్ తో ఈ సందర్భంగా భేటీ అయినట్లు తెలిపారు.
ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో పరిశ్రమదారులకు మద్దతుగా నిలుస్తాం: మంత్రి నారా లోకేష్
By admin1 Min Read
Previous Articleఫిడే చెస్ వరల్డ్ కప్ లో విజేతగా నిలిచిన దివ్య దేశ్ ముఖ్
Next Article పహాల్గాం ఉగ్రవాదులను అంతం చేసిన భారత బలగాలు