టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈనెలలో అమలు చేయబోతున్న ‘అన్నదాత సుఖీభవ’, ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ పథకాల గురించి మరోసారి వారికి వివరించారు.
గతంలో జగన్ రైతులను మోసం చేశారని రైతు భరోసా పేరుతో వంచనచేశారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దానితో కలిపి రూ.20వేలు రైతుల ఖాతాల్లో వేయనున్నట్లు తెలిపారు. ఈ రెండు కార్యక్రమాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని ఈసందర్భంగా దిశానిర్దేశం చేశారు. ప్రజల్లోకి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ చేయనున్నట్లు తెలిపారు. తమకు కార్యకర్తలే ముఖ్యమని కష్టపడి పని చేసినవారికి త్వరలో పదవులు ఇవ్వనున్నట్లు తెలిపారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

