భారత ఉపరాష్ట్రపతి పదవికి ఇటీవల జగదీప్ ధన్కర్ రాజీనామా చేశారు. దీంతో కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 9న ఆ ఎన్నిక జరగనుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. జగదీప్ ధన్కర్ తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే ఆయన తన పదవి నుంచి తప్పుకున్నారు. 74 ఏళ్ల ధన్కర్ ఆరోగ్యపరమైన కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ పంపారు. 2022 ఆగస్టు 11న ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ధన్కర్ 2027 ఆగస్టు వరకూ పదవీకాలం ఉంది. అయితే రెండేళ్ల 344 రోజులకే పదవిని వీడారు. తర్వాత ఉప రాష్ట్రపతిగా ఎవరిని ఎన్నుకుంటారనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. దీనిపై ఆగస్టు 7న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. నామినేషన్లు దాఖలుకు చివరితేదీ ఆగస్టు 21గా ప్రకటించింది. పోలింగ్ తేదీ రోజే అంటే సెప్టెంబర్ 9నే ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎన్డీయే కూటమి అభ్యర్థి విజయం సాధించడం లాంఛనమే. ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీయే ఎవరిని బరిలోకి దించనుందో అనే ఆసక్తి నెలకొంది.
నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం నోటిఫికేషన్… సెప్టెంబర్ 9న ఎన్నిక
By admin1 Min Read