ప్రభుత్వ పాఠశాలల్లో చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఆదోని మున్సిపల్ నెహ్రూ మెమోరియల్ హైస్కూల్లో నో అడ్మిషన్ల బోర్డు చూసి చాలా ఆనందించినట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. 1725 మంది విద్యార్థులున్న ఈ హైస్కూలులో ఈ ఏడాది అన్ని తరగతుల్లో 400 మందికి పైగా కొత్త విద్యార్థులు చేరడం ప్రభుత్వ విద్య పట్ల ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. “నో అడ్మిషన్ బోర్డు పెట్టి, అడ్మిషన్స్ క్లోజ్ చేశామని తల్లిదండ్రులకు నచ్చజెపుతున్నా, మా పిల్లాడి ఒక్కడిని చేర్చుకోండి సార్“ అని బతిమాలుతుంటే కాదనలేకపోతున్నామని చెబుతున్న హెడ్మాస్టర్ ఫయాజుద్దీన్ గారికి, టీచర్లు, సిబ్బందికి ఈసందర్భంగా ఆయన తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి స్కూలులో ఇలాగే నో అడ్మిషన్ బోర్డులు కనిపించాలి. తల్లిదండ్రుల్లో ప్రభుత్వ విద్య పట్ల నమ్మకం కల్పించిన ఉపాధ్యాయులే ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తీర్చిదిద్దే రథసారధులని లోకేష్ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు