భారత ప్రధానిగా ఇటివలే నరేంద్ర మోడీ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. దేశంలో ఎక్కువ కాలం ప్రధానిగా పని చేసిన రెండో నేతగా ఆయన సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో ఇందిరాగాంధీని ఆయన అధిగమించారు. ఎక్కువ కాలం పని చేసిన భారత ప్రధానిగా మోడీ కంటే ముందు తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఉన్నారు.
ఇదిలా ఉండగా…తాజాగా ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక మైలురాయిని దాటారు. దేశ చరిత్రలో కేంద్ర హోంమంత్రిగా పని చేసిన రికార్డును అమిత్ షా సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ పేరిట ఉన్న రికార్డును షా అధిగమించారు. మోడీ మొదటి పాలనా కాలంలో కేంద్ర హోంమంత్రిగా రాజ్ నాథ్ సింగ్ పని చేశారు. 2019లో మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో అమిత్ షా 6 సంవత్సరాల 64 రోజులుగా కేంద్ర హోం మంత్రి పదవిలో కొనసాగుతున్నారు.
మొన్న ప్రధానిగా మోడీ… నేడు కేంద్ర హోం మంత్రిగా అమిత్ షా సరికొత్త రికార్డులు
By admin1 Min Read

