ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా భారత టెస్టు కెప్టెన్ శుభ్ మాన్ గిల్ ఎంపికయ్యాడు. జూలైలో ఇంగ్లాండ్ తో సిరీస్ లో భాగంగా 3 టెస్టు మ్యాచ్ లలో 94.50 యావరేజ్ తో 567 రన్స్ చేశాడు. మొత్తంగా ఇంగ్లాండ్ తో సిరీస్ లో 4 సెంచరీలు సహా 754 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ‘ గా నిలవడం గిల్ కు ఇది 4వ సారి. ఈ సంవత్సరం ఫిబ్రవరి, 2023 జనవరి, సెప్టెంబర్ లలో కూడా గిల్ ఈ అవార్డును పొందాడు. ఇన్నిసార్లు ఆ అవార్డు గెలుచుకున్న మెన్స్ క్రికెటర్ శుభ్ మాన్ గిల్ కావడం గమనార్హం. ఉమెన్స్ క్రికెటర్లలో వెస్టిండీస్ కు చెందిన హేలీ మ్యాథ్యూస్, ఆస్ట్రేలియా కు చెందిన ఆష్లీ గార్డ్ నర్ నాలుగేసి సార్లు ఈ అవార్డు పొందారు. ఇక జూలై నెలకు సంబంధించి ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ఇంగ్లాండ్ క్రికెటర్ సోఫియా డంక్లీ ఎంపికైంది. భారత్ తో వన్డే, టీ20 సిరీస్ లలో ఆమె 7 మ్యాచ్ లలో 270 పరుగులు చేసింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు