భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ నేషనల్ రికార్డుల పరంపర కొనసాగుతోంది. 3000 మీటర్ల రన్ లో అతను తన పేరు మీద ఉన్న నేషనల్ రికార్డును తిరగరాశాడు. బుడాపెస్ట్ లో జరిగిన హాంగేరియన్ అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రి లో 3000 మీటర్ల రేసును 7 నిమిషాల 34.49 సెకన్లలో పూర్తి చేసి 5వ స్థానంలో నిలిచాడు. కెన్యా అథ్లెట్ కిస్సాంగ్ మ్యాథ్యూ 7 నిమిషాల 33.23 సెకన్లలో రేసు పూర్తి చేసి విజేతగా నిలిచాడు. మెక్సికో కు చెందిన హెరీరా 7ని.33.58సెకన్లతో రెండో స్థానంలో, ఆస్కార్ చెలిమో 7ని.33.93 తర్వాత స్థానంలో నిలిచారు.
Previous Articleపులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ భారీ విజయం
Next Article పెరుగుతున్న కృష్ణానది ప్రవాహం..!