దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం, పోలీసు గౌరవ వందనం స్వీకరించి, పెరేడ్ పరిశీలించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమ కూటమిని నమ్మి చరిత్రాత్మక తీర్పునిచ్చారు. నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించారు. 94 శాతం స్ట్రైక్ రేట్, 57 శాతం ఓట్ షేర్ తో తమ ఎన్డీయే కూటమిని దీవించారని అన్నారు. ఏపీని పునర్నిర్మించాలనే ఏకైక లక్ష్యంతో పాలన ప్రారంభించాం. అధికారాన్ని చేపట్టిన ఏడాదిలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా, భవిష్యత్తుకు బాటలు వేసేలా పని చేశామని పేర్కొన్నారు. మొదటి సంతకం నుంచి సుపరిపాలన వైపు అడుగు వేశాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో సాగిన ఏడాది పాలన ఎంతో సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. ప్రజల మద్దతు, మా సంకల్పం, దేవుడి దయతో విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం చేస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమానికి సాటి లేదు.. అభివృద్ధికి అడ్డు లేదు.. సుపరిపాలనకు పోటీ లేదు. ఇది రికార్డు.. ఇదే ఆల్టైమ్ రికార్డు అని పునరుద్ఘాటించారు. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం. బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం సాధించిన ఘనతలను ఈసందర్భంగా సీఎం చంద్రబాబు వివరించారు.
విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం… అన్ని వర్గాలకు అండగా కూటమి ప్రభుత్వం: ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read