సీనియర్ హీరో వెంకటేష్ ఈ సంవత్సరం ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో ఘన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో సినిమాను ఆయన నేడు ప్రారంభించారు. వెంకటేష్ 77వ చిత్రంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఇది తెరకెక్కనుంది. హారికా హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నితిన్, తరుణ్ వంటి హీరోలతోనే సినిమాలు చేసిన త్రివిక్రమ్ మొదటి సారి సీనియర్ టాప్ హీరోతో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం టాప్ లీగ్ లో ఉన్న దర్శకులందరూ కూడా సీనియర్ హీరోలతో సినిమాలు చేయడం లేదు. యంగ్ స్టార్స్ తోనే సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. అయితే గతంలో వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే అందించారు త్రివిక్రమ్. ఈ రెండు సినిమాలు అతిపెద్ద విజయాలుగా నిలిచాయి. ఈ రెండు సినిమాల మధ్యలో ‘వాసు’ అనే సినిమాకు మాటలు అందించారు. త్రివిక్రమ్ డైలాగ్స్ వెంకటేష్ టైమింగ్ కు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ఇప్పుడు వీళ్ల కాంబినేషన్ లో సినిమా అనగానే ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు