లోక్ సభలో ఈరోజు ‘ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు – 2025’ను కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రవేశపెట్టారు. విపక్ష సభ్యుల నిరసనల మధ్య కేంద్రం బిల్లు ప్రవేశపెట్టింది. ఈ – స్పోర్ట్స్, సోషల్ గేమ్స్ కు ప్రోత్సాహం, ఆన్‌లైన్ మనీ గేమ్స్‌పై నిషేధం విధిస్తారు. అలాగే యువత, కుటుంబాలను ఆర్థిక, మానసిక, సామాజిక ముప్పుల నుంచి రక్షించడమే లక్ష్యంగా ఈ బిల్లును తీసుకు వస్తున్నారు. ఇటీవల కాలంలో ఆన్‌లైన్ గేమింగ్ యాప్ లతో పలు మోసపూరిత వ్యవహారాలు పెద్దసంఖ్యలో వెలుగులోకి వచ్చాయి. వాటిని ప్రమోట్ చేస్తున్న ప్రముఖులు పై కూడా దర్యాప్తు సంస్థలు కొరడా ఝుళిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో నేడు (ఆగస్టు 20న) లోక్‌సభ ఎదుటకు ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు – 2025ను తీసుకువచ్చారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు