ఆవిష్కరణలకు వనరులు అడ్డంకి కాదని, వినూత్నమైన ఆలోచనలే ముఖ్యమని, ప్రతి యువకుడు విద్యార్థి దశ నుంచే మెరుపులాంటి ఆలోచనలతో ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని మానవాభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రసంగించారు. ఇన్నొవేషన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా ఏపీని తీర్చిదిద్దేందుకు దిగ్గజ పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలతో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఈసందర్భంగా చెప్పారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్నది సీఎం చంద్రబాబు ఆశయమని అన్నారు. సవాళ్లను అవకాశాలుగా మార్చుకొని ముందుకు సాగుదాం. ఆవిష్కర్తలకు అన్నివిధాలా సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు.
సవాళ్లను అవకాశాలుగా మార్చుకొని ముందుకు సాగుదాం: మంత్రి నారా లోకేష్
By admin1 Min Read
Previous Articleలోక్ సభ ముందుకు కీలక బిల్లు… శశిథరూర్ కీలక వ్యాఖ్యలు
Next Article ‘ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు – 2025’ కు కేంద్రం ఆమోదం