ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఈరోజు తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు మంత్రుల సమక్షంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను రాధాకృష్ణన్ సమర్పించారు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా నాలుగు సెట్ల పేపర్లు దాఖలు చేశారు. మొదటి సెట్ కు చీఫ్ ప్రపోజర్‌గా ప్రధాని ఉన్నారు. నామినేషన్ పత్రాల దాఖలుకు ముందు సీపీ రాధాకృష్ణన్ ప్రేరణా స్థల్ వద్ద మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. సీపీ రాధాకృష్ణన్ విజయంపై ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేసారు. ఆ పదవికి రాధాకృష్ణన్ వన్నెతెస్తారని, దేశం మరింత అభివృద్ధి పథంలోకి వెళ్తుందని ఈసందర్భంగా ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు
By admin1 Min Read
Previous Article‘ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు – 2025’ కు కేంద్రం ఆమోదం
Next Article అగ్ని-5ని విజయవంతంగా పరీక్షించిన భారత్