భారత్ ఎప్పటికప్పుడు తన ఆయుధ సంపత్తిని మెరుగుపరుచుకుంటూ రక్షణా పరంగా శత్రు దుర్భేద్యంగా దూసుకెళ్తోంది. తాజాగా అణ్వాయుధ సామర్థ్యం కలిగిన మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ మిస్సైల్ అగ్ని-5ని విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ టెస్టు చేపట్టినట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. స్ట్రాటెజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షలో అగ్ని-5 మిస్సైల్ అన్ని టెక్నికల్, కార్యచరణ రేంజ్ లను అందుకున్నట్టు ప్రకటించాయి. అగ్ని-5 అనేది డీఆర్‌డీవో దేశీయంగా అభివృద్ధి చేసిన అణ్వాయుధ సామర్థ్యం కలిగిన మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి. భారత్ వద్ద ఉన్న అగ్ని శ్రేణిలో ఇది అత్యంత అధునాతన మిస్సైల్. ఇది 5 వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను కూడా తేలికగా ఛేదించగలదు.
Previous Articleఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు
Next Article ‘విశ్వంబర’ అందరినీ అలరిస్తుంది… చిరు వీడియో..!