సీనియర్ అగ్ర కధానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘విశ్వంభర’. ‘బింబిసార’ వంటి విజయవంతమైన చిత్రంతో ఆకట్టుకున్న వశిష్ట ఈ భారీ ప్రాజెక్ట్ ను డైరెక్ట్ చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.
త్రిష, ఆషిక రంగనాథ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈచిత్రానికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ చిత్రం ఎందుకు లేట్ అవుతుంది వంటి అంశాలను అందులో వివరించారు. ఈ సినిమా సెకండ్ హాఫ్ మొత్తం వీఎఫ్ఎక్స్ మీద ఆధారపడి ఉంది. దీన్ని అత్యుత్తమంగా ప్రేక్షకులకు అందించాలనే ప్రయత్నమే ఈ ఆలస్యానికి ప్రధాన కారణమని తెలిపారు. ఎలాంటి విమర్శలకు చోటివ్వకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సినిమా చందమామ కథలా సాగిపోతుంది. చిన్నాపెద్దా తేడా లేకుండా ఈ సినిమా అందర్నీ అలరిస్తుంది.ఈ సినిమాను 2026 సమ్మర్ లో ఎంజాయ్ చేయండని ఆ వీడియోలో చిరు వివరించారు.
A MEGA BLAST ANNOUNCEMENT about #Vishwambhara from MEGASTAR @KChirutweets ❤️🔥
Let us celebrate the MEGA BIRTHDAY with #MEGABLASTTEASER out today at 6.06 PM 💥
MEGA MASS BEYOND UNIVERSE 💫 pic.twitter.com/dBkmRlXOzA
— Team Megastar (@MegaStaroffl) August 21, 2025