విలక్షణ నటుడు సత్య దేవ్ ప్రధానపాత్రలో రూపొందుతున్న చిత్రం ‘రావు బహదూర్’. వెంకటేష్ మహా దర్శకత్వం వహిస్తున్నారు. అగ్ర కథానాయకుడు మహేశ్ బాబు నిర్మాణ సంస్థ జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సమర్పిస్తున్నారు. చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర లు నిర్మిస్తున్నారు. తాజాగా దీని టీజర్ ను టాప్ డైరెక్టర్ రాజమౌళి విడుదల చేశారు. ‘అనుమానం అనే భూతం పట్టిందంటూ..’ అంటూ ఆసక్తికరమైన డైలాగుతో ఈ వీడియో ప్రారంభమైంది. ఒక డిఫరెంట్ నేపథ్యం ఉన్న కథతో దీన్ని తీర్చిదిద్దినట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. వచ్చే వేసవికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు