రాష్ట్రంలో ఆక్వా రంగానికి అన్ని విధాల అండగా నిలుస్తామని ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అమెరికా ప్రతీకార సుంకాల నేపథ్యంలో రాష్ట్రంలో ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు ఉండవల్లి నివాసంలో ఆక్వా కల్చర్ అడ్వైజరీ కమిటీ సమావేశమైంది. రష్యా, యూరోపియన్ యూనియన్ మార్కెట్ పై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా లోకేష్ అన్నారు. సమస్యల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఆక్వా ఎగుమతి దారులు, ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులు, రైతులు, ఫీడ్ కంపెనీ, హేచరీస్ యజమానులు సలహాలు, సూచనలు అందించారు. సమావేశంలో చర్చించిన అంశాలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై త్వరలోనే కేంద్రానికి నివేదిస్తామని లోకేష్ తెలిపారు.
Previous Article‘విశ్వంబర’ అందరినీ అలరిస్తుంది… చిరు వీడియో..!
Next Article రూ.2,047 కోట్ల నిర్మాణ వ్యయంతో అమరావతికి రైల్వే లైన్