ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అనుసంధానం చేసేందుకు రూ.2,047 కోట్ల నిర్మాణ వ్యయంతో ఎర్రుబాలెం – అమరావతి -నంబూరు మధ్య 57 కిలోమీటర్ల రైల్వే మార్గం నిర్మిస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటలో తెలిపారు. దీనిని ప్రత్యేక ప్రాజెక్టుగా భావించి భూ సేకరణ ప్రారంభించినట్లు తెలిపారు. దీని కోసం రూ.171 కోట్లు 2025-26 బడ్జెట్ లో కేటాయించినట్లు పేర్కొన్నారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఈమేరకు కేంద్ర మంత్రి బదులిచ్చారు. ఇంకా ఏపీలో జరుగుతున్న పలు రైలు ప్రాజెక్టుల గురించి వివరించారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 1 గణాంకాల ప్రకారం 27 డబ్బింగ్, 12 కొత్త లైన్ల పనులు జరుగుతున్నాయని చెప్పారు.
Previous Articleఆక్వా రంగానికి అండగా నిలుస్తాం: మంత్రి నారా లోకేష్
Next Article ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ