భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తాజాగా ఆయన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు. ఈసందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.రూ.67 వేల కోట్లతో 23 అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఆర్.జె శంకర్ నేత్ర చికిత్సాలయాన్ని ప్రారంభించారు.వారణాసిలోని శ్రీ కంచి పీఠాన్ని సందర్శించి అక్కడ హిందూ ధర్మానికి సంబంధించి నెలకొల్పిన ప్రదర్శనను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా కంచి పీఠాధిపతులు ప్రధాని మోడీకి ప్రత్యేక ఆశీర్వాదాలు అందించారు.
వారణాసిలో ప్రధాని మోడీ పర్యటన: పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
By Indu1 Min Read