భారత్ సాధించిన డిజిటల్ విప్లవంపై ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ పాల్ మైకేల్ రోమెర్ ప్రశంసల వర్షం కురిపించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం డిజిటల్ విప్లవాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగిందని పేర్కొన్నారు. భారత డిజిటల్ విప్లవం అత్యంత స్ఫూర్తిదాయకమైన, ఆసక్తికరమైన విజయగాథల్లో ఒకటిగా ఆయన అభివర్ణించారు. ఈ డిజిటల్ విప్లవం ప్రజల జీవితాలను సులభతరం చేయడమే కాకుండా, మిగిలిన ప్రపంచానికి ఒక గొప్ప ఉదాహరణలా నిలిచిందని అభివర్ణించారు. ప్రపంచ శక్తులకు సరికొత్త ప్రమాణాలను నిర్దేశించిందని అన్నారు. ప్రొఫెసర్ పాల్ రోమెర్ గతంలో ప్రపంచ బ్యాంకు చీఫ్ ఎకనామిస్ట్ గా వ్యవహరించారు. ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన భారత జాతీయ మీడియాతో మాట్లాడుతూ తన ఆలోచనలు పంచుకున్నారు.
భారత్ సాధించిన డిజిటల్ విప్లవంపై నోబెల్ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ పాల్ మైకేల్ రోమెర్ ప్రశంసలు
By Indu1 Min Read
Previous Articleనాడు వైసీపీ నీరుగార్చి నిర్వీర్యం చేయాలని చూస్తే.. నేడు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది: వైఎస్ షర్మిల
Next Article ఆకట్టుకుంటున్న ‘ది రాజాసాబ్’ అప్ డేట్