డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(D.El.Ed) విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. ఈ మేరకు టైంటేబుల్‌ను ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డి.దేవానందరెడ్డి విజయవాడలోని తన కార్యాలయంలో విడుదల చేశారు. నవంబర్ 4,5,6,7 తేదీలలో ఉదయం 9- 11.30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని, 2023- 25 బ్యాచ్‌తో పాటు 2022- 24, 2021- 23లలో ఫెయిలైనవారు ఈ పరీక్షలు రాయాల్సి ఉంటుందని దేవానందరెడ్డి తెలిపారు.
Previous Articleవైద్య కళాశాలకు పింగళి వెంకయ్య పేరు పెట్టినందుకు ధన్యవాదాలు: పవన్
Next Article కడప జిల్లాలో పర్యటించనున్న YS జగన్