కడప జిల్లాలో మూడు రోజుల పాటు మాజీ సీఎం జగన్ పర్యటన ఖరారైంది. బుధవారం తెనాలి నుంచి బద్వేలుకు చేరుకుంటారు. అక్కడ ఉన్మాది చేతిలో బలైన దస్తగిరమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం బ్రహ్మంగారి మఠం చేరుకుని వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం పులివెందుల చేరుకుని గురువారం, శుక్రవారం కార్యకర్తలకు జగన్ అందుబాటులో ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Previous Articleకృష్ణా: D.El.Ed పరీక్షల టైం టేబుల్ విడుదల
Next Article జాతీయ స్థాయిలో గూడూరు క్రీడాకారుడు సత్తా