ఈ రోజుల్లో చాలా మంది గార్డెనింగ్ ఇష్టపడుతున్నారు. చిన్న స్థలం ఉన్నా సరే అక్కడ మొక్కల్ని పెంచుతున్నారు. నగరాల్లో నివసించే ప్రజలు కుండీల్లో మొక్కల్ని నాటుతున్నారు. గ్రామాల్లో ఉన్న ప్రజలు తమ పెరట్లో కూరగాయలు, పూల మొక్కలతో పాటు కొన్ని ఔషధపు మొక్కల్ని పెంచతున్నారు. ఇక, సాధారణంగా గార్డెన్లో పూలు, పండ్లతో పాటు ఇతర గార్డెనింగ్ మొక్కల్ని పెంచుతుంటాం. మన పెరడు లేదా బాల్కనీలో కొన్ని రకాల మొక్కలను పెంచడం ద్వారా శారీరక, మానసిక, ఆరోగ్యపరమైన లాభాల్ని పొందవచ్చు.
అయితే, మొక్కలు పెంచాలి అన్న ఆలోచన ఉండే సరిపోదు.. వాటిని పెంచడం కూడా తెలిసి ఉండాలి. ఇక, చాలా మంది ఇంట్లో మొక్కలు బాగా పెరగాలన్న ఉద్దేశంతో రకరకాల రసాయనాలు వాడతారు. అయితే, రసాయనాలతో నేల సారం దిబ్బతినడమే కాకుండా.. మొక్కలు కూడా నాశనమయ్యే ప్రమాదముంది. రసాయనాలకు బదులు చెత్త అని పడేసే కొన్నింటిని మొక్కలకు ఎరువులుగా వాడవచ్చు. ఈ సహజమైన పదార్థాలు మొక్కల పెరుగుదల్ని ప్రోత్సాహిస్తాయి. ఇవి సహజమైన ఎరువులుగా పనిచేస్తాయి.