ఈ రోజుల్లో చాలా మంది గార్డెనింగ్ ఇష్టపడుతున్నారు. చిన్న స్థలం ఉన్నా సరే అక్కడ మొక్కన పెంచుతున్నారు. నగరాల్లో నివసించే ప్రజలు కుండీల్లో మొక్కల్ని నాటుతున్నారు. ఇక, సాధారణంగా గార్డెన్‌లో పూలు, పండ్లతో పాటు ఇతర గార్డెనింగ్ మొక్కల్ని పెంచుతుంటాం. మన పెరడు లేదా బాల్కనీలో కొన్ని రకాల మొక్కలను పెంచడం ద్వారా శారీరక, మానసిక, ఆరోగ్యపరమైన లాభాల్ని పొందవచ్చు. ఇక, గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్నవారు తమ ఇంట్లో చాలా వరకు పూల కుండీలు పెట్టుకుంటున్నారు.
ఇక, అక్టోబర్ నెలలో పూల మొక్కలు బాగా వికసిస్తాయి. ఈ సీజన్‌లో మందార, బంతి, గులాబీలు, సతత హరిత పువ్వులు బాగా వికసిస్తాయి. అందుకే ఈ సీజన్‌లో మొక్కలకు అదనపు సంరక్షణ అవసరం. ఈ నెలాఖరులోపు మొక్కలను సరిగ్గా సంరక్షించినట్లయితే, తోట అందమైన పువ్వులతో నిండి ఉంటుంది. దీపావళి సందర్భంగా పూజ కోసం తోట పువ్వులను దేవుడికి సమర్పించాలనుకుంటే.. మొక్కలు ఆరోగ్యం ఉండటం కోసం ఈ చిట్కాలు ఫాలో అవ్వండి. ఈ చిట్కాలతో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పూలు బాగా వికసించేలా చేసే