మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, విలక్షణ దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్ చేంజర్’.ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఈ భారీ చిత్రం 2025 జనవరి 10న సంక్రాంతి విడుదల చేయనున్నారు.
‘గేమ్ చేంజర్’ సంబంధించిన చిత్రబృందం టీజర్ ప్రోమోను నిన్న విడుదల చేసింది.అయితే ఈరోజు చిత్రబృందం టీజర్ ను విడుదల చేసింది. ‘గేమ్ చేంజర్’ చిత్రంలో రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. శంకర్ శైలిలో గ్రాండియర్ గా ఉంది. రామ్ చరణ్ చేసిన యాక్షన్ సన్నివేశాలు అలరిస్తున్నాయి. ఇందులో అంజలి, సముద్రఖని, ఎస్ జె సూర్య, శ్రీకాంత్, సునీల్ కీలకపాత్రలు పోషించారు.ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.