డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటింది. లీగ్ దశను అజేయంగా ముగించి ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే సెమీఫైనల్లో స్థానాన్ని ఖాయం చేసుకున్న భారత్ తాజాగా తన ఆఖరి లీగ్ మ్యాచ్లో 3-0తో జపాన్ పై విజయం సాధించింది. భారత్ తరపున దీపిక (47వ, 48వ) రెండు గోల్స్ సాధించింది. నవ్ నీత్ (37వ) ఓ గోల్ చేసింది. భారత డిఫెండర్లు మంచి పోరాటం కనబరిచారు. భారత్ అయిదు మ్యాచ్లో 15 పాయింట్లతో లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచింది. చైనా (12 పాయింట్లు) రెండో స్థానంతో ముగించింది. భారత జట్టు సెమీఫైనల్లో జపాన్ తో తలపడనుంది. మరో సెమీస్లో చైనా, మలేసియా ఆడనున్నాయి. భారత స్టార్ స్ట్రైకర్ దీపిక టోర్నీలో ఇప్పటివరకు 10 గోల్స్ తో అదరగొట్టింది.
Previous Articleపరిశ్రమల ప్రోత్సాహం ద్వారా ఉద్యోగాలు కల్పిస్తాం
Next Article ప్రొ కబడ్డీ లీగ్ 11:హార్యానా జోరు