గత ప్రభుత్వ పనితీరుపై ఏపీ హోం మంత్రి అనిత మండిపడ్డారు. మహిళలపై అత్యాచారాలు జరిగితే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఐదో రోజు శాసనమండలి సమావేశాల్లో మంత్రి ప్రసంగించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ”పరామర్శకు వెళ్లిన మాపైనే కేసులు పెట్టారు. దిశ చట్టం గురించి గొప్పగా చెబుతున్నారని అయితే అసలు ఆ చట్టం ఉందా? దిశ యాప్, చట్టం పని చేస్తే మహిళలపై అఘాయిత్యాలు ఎందుకు పెరిగాయని ప్రశ్నించారు. ఉన్న నిర్భయ చట్టాన్ని వదిలేసి లేని దిశ చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన వారిని అరెస్టు చేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో పోలీసులు 24 నుంచి 48 గంటల్లో నేరస్థుల్ని పట్టుకుంటున్నారని పేర్కొన్నారు. దిశ చట్టానికి చట్టబద్దత లేకుండా దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశారు. దిశ యాప్ తో నేరాలు తగ్గింది నిజమైతే.. రికార్డుల్లో ఎందుకు నేరాలు పెరుగుతున్నాయని ప్రశ్నించారు. అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్ కట్టడానికి వైసీపీ హయాంలో కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని అది పూర్తయి ఉంటే నేరాలు జరిగిన వెంటనే శిక్షలు పడేందుకు అవకాశం ఉండేదని అనిత మండిపడ్డారు.
Previous Articleపిఎం మోడీకి నైజీరియా అత్యున్నత పురస్కారం
Next Article “సబర్మతి రిపోర్ట్” చిత్రంపై ప్రధాని ట్వీట్..!