అగ్రకథానాయకుడు అల్లు అర్జున్ “పుష్ప 2” ట్రైలర్ తాజాగా విడుదలై నెటింట్లో రికార్డులపరంగా విధ్వంసం స్పష్టిస్తుంది.ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.ఇందులో ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ట్రైలర్ ఇప్పటికే రికార్డులను బద్దలు కొట్టింది.యూట్యూబ్‌లో అత్యంత వేగంగా 40 మిలియన్ల వీక్షణలను చేరుకుంది.1.4 మిలియన్లకు పైగా లైక్‌లను సంపాదించింది.అద్భుతమైన విజువల్స్,బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అల్లు అర్జున్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో విడుదలైన ఈ ట్రైలర్ నెటింట్లో అదరగొడుతోంది.
నిన్న “పుష్ప 2: ది రూల్” చిత్ర ట్రైలర్ ను నిర్మాతలు బీహార్‌లోని పాట్నాలో విడుదల చేశారు.తాజాగా విడుదల చేసిన ట్రైలర్లో డ్రామా, మిస్టరీ, యాక్షన్, మ్యూజిక్, రొమాన్స్, కల్చర్ వంటి అన్ని అంశాలను డైరెక్టర్ సుకుమార్ చూపించాడు.పుష్ప: ది రైజ్‌లో తక్కువ స్క్రీన్ టైం ఉన్న నటుడు ఫహద్ ఫాసిల్, పుష్ప: ది రూల్‌లో ఎక్కువ టైంలో కనిపించనున్నట్లు సమాచారం.పుష్ప 2: ది రూల్ చిత్రాన్ని డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.పుష్ప-1తో జాతీయ ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.