బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించడం కాకుండా , స్వీయ దర్శకత్వంలో “ఎమర్జెన్సీ” అనే చిత్రం తెరకెక్కుతుంది.ఈ చిత్రం విడుదలకు ముందే పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇందులో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను ప్రముఖంగా చూపించనున్నారు.ఈ చిత్రం ప్రచార చిత్రాలు విడుదలైనప్పటి నుండి చిత్రంపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. తమ గురించి తప్పుగా చిత్రీకరించారంటూ ఓ వర్గం సెన్సార్ బోర్డుకు లేఖ కూడా రాసింది.దీనితో సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి సంబంధించి పలు సన్నివేశాల్లో అభ్యంతరం వ్యకతం చేసింది.అయితే సెన్సార్ బోర్డులోనూ చాలా సమస్యలున్నాయని, తమ చిత్రానికి సర్టిఫికెట్ ఇవ్వడంలేదంటూ కంగన అసహనం వ్యక్తం చేశారు. న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమన్నారు.
ఎమర్జెన్సీ చిత్రం విషయంలో ఓ నిర్ణయానికి రావాలంటూ బాంబే హైకోర్టు కూడా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్స్ సర్టిఫికేషన్‌ను ఆదేశించింది.
ఈ మేరకు సెన్సార్ బోర్డు నుండి క్లీన్ చిట్ అక్టోబర్ 17న వచ్చింది.తమ చిత్రానికి సెన్సార్ పనులు పూర్తైనట్లు కంగన కూడా ఎక్స్ వేదికగా తెలిపారు. అయితే ఈ చిత్రం కొత్త విడుదల తేదీని ఖరారు చేశారు.ఈ విషయాన్ని కంగనా ఎక్స్ లో పోస్ట్ చేశారు.ఈ చిత్రం వచ్చే ఏడాది 2025 జనవరి 17న విడుదల చేయనున్నట్ల ప్రకటించింది.ఈ చిత్రానికి ఆమె దర్శకత్వంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించారు. జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే నటిస్తున్నారు.
17th January 2025 – The epic saga of the nation’s most powerful woman and the moment that altered India’s destiny. #Emergency – Unveils Only in cinemas on 17.01.2025! @KanganaTeam @AnupamPKher #SatishKaushik @shreyastalpade1 #MahimaChaudhry @milindrunning #VishakNair… pic.twitter.com/dC0gnYSNlW
— Kangana Ranaut (@KanganaTeam) November 18, 2024