2023-24 సామాజిక ఆర్థిక సర్వే వివరాలను ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. 2022–23తో పోలిస్తే.. జీఎస్డీపీ వృద్ధిలో 3.1% తగ్గుదల కనిపించింది. తలసరి ఆదాయం 1.21% తక్కువ కాగా.. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలదీ నేలచూపే కావడం గమనార్హం. సాగు, ఆహార ధాన్యాల ఉత్పత్తి భారీగా తగ్గుదల కనిపించింది.
2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే 2019-24 మధ్య వైసీపీ హయాంలో జీఎస్ఓపీ, తలసరి ఆదాయం సహా వ్యవసాయం, సేవా రంగాల్లో వృద్ధి రేటు భారీగా తగ్గింది. 2022-23 సంవత్సరంతో చూసినా 2023-24లో వృద్ధి రేటులో తగ్గుదల కనిపించింది. 2022-23లో జీఎస్డీపీ వృద్ధి 13.5% ఉండగా.. 2023- 24లో ముందస్తు అంచనాల మేరకు ఇది 10.4% మాత్రమే. తలసరి ఆదాయంలోనూ వృద్ధి 11.49% నుండి 10.28%కి తగ్గింది. ఆహారధాన్యాల ఉత్పత్తి 22 లక్షల టన్నులు తగ్గింది. వ్యవసాయంలో వృద్ధి రేటు భారీగా తగ్గింది.
వ్యవసాయం 2014-19లో 16.6శాతం కాగా, 2019-24లో 10.5 శాతంగా ఉంది. సేవలు 2014-19లో 11.9 శాతం 2019-24లో 10.2 శాతం. పారిశ్రామికం 2014-19లో 11.9 శాతం 2019-24లో 12.9శాతం.
Previous Articleనాగ చైతన్య ‘తండేల్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్…!
Next Article వచ్చేది ఏడాది జనవరి 17న విడుదల కానున్న “ఎమర్జెన్సీ”