ఈరోజు ఉదయం 8.00 గంటలకు ఢిల్లీలో వాయు నాణ్యతా ప్రమాణం (ఎక్యూఐ) రికార్డుస్థాయిలో 484కి చేరింది.ఈ సీజన్‌లో ఇదే అత్యధిక రికార్డు.ఢిల్లీ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్యూఐ 500 మార్కును దాటింది.దేశ రాజధానిలో తీవ్రమైన వాయు కాలుష్యం దృష్ట్యా సుప్రీంకోర్టు వర్చువల్‌గా విచారణ చేపట్టనుంది అని తెలుస్తుంది.కాగా వర్చువల్‌గా వాదనలు వినిపించేందుకు అనుమతించాలని న్యాయమూర్తులందరూ కోరినట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా వెల్లడించారు.ఢిల్లీ, ఎన్‌సిఆర్ పరిధిలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుందని సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్ (ఎస్‌సిబిఎ) అధ్యక్షుడు కపిల్ సిబల్ ఆవేదన వ్యక్తం చేశారు.
కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సిజెఐ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనాన్ని కోరారు.సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, గోపాల్ శంకరనారాయణన్‌లతో సహా పలువురు న్యాయవాదులు కపిల్ సిబాల్ కు మద్దతు తెలిపారు.ఈ మేరకు ఏ కేసులోనైనా సరే న్యాయవాదులు సాధ్యమైన చోట్ల వర్చువల్‌గా తమ వాదనలు వినిపించవచ్చని సిజెఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు.

