కోలీవుడ్ నటుడు విజయ్ గత కొన్నిరోజులుగా రాజకీయాల్లో బిజీ అయిన విషయం తెలిసిందే. హెచ్.వినోద్‌తో చేస్తోన్న చిత్రం (విజయ్ 69) పూర్తైన తర్వాత ఆయన సినిమాల్లో యాక్ట్ చేయరని ఎప్పటినుంచో టాక్.తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం బాలయ్య సినిమా రీమేక్ అని తెలుస్తోంది. బాలయ్య ఇటీవల విజయం సాధించిన చిత్రంలో ఒకటైన భగవంత్ కేసరి రీమేక్‌గా విజయ్ చిత్రం రూపుదిద్దుకుంటుందని వార్తలు వస్తున్నాయి.కాజల్ పాత్రలో పూజాహెగ్డే, శ్రీలీల పాత్రలో మమత బీజు నటిస్తున్నారని సమాచారం.
రాజకీయాల్లోకి వెళ్లాక కమర్షియల్ చిత్రాల్లో నటిస్తే బాగుండదు అని విజయ భావిస్తున్నారని తెలుస్తుంది. ఏదైనా సందేశం ఉన్న చిత్రం అయితే బాగుంటుందని,అందుకే ఈ రీమేక్‌లో నటిస్తున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.అయితే విజయ్ రీమేక్స్‌లో యాక్ఠ్ చేయడం కొత్తేమీ కాదు. గతంలోనూ తెలుగులో వచ్చిన పవిత్ర బంధం, పెళ్లి సందడి,తమ్ముడు,చిరునవ్వుతో,నువ్వు నాకు నచ్చావ్,పోకిరి వంటి చిత్రాల తమిళ రీమేక్స్‌లో నటించాడు.