జీ20 సదస్సులో భాగంగా వివిధ దేశాలకు చెందిన అగ్ర నేతలతో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.దేశ ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను భారత్‌కు అప్పగించాలని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో జరిగిన సమావేశంలో మోదీ కోరారు.వారితో పాటు పన్ను ఎగవేత,మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ భండారీని కూడా రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
తప్పుడు ఎల్‌వోయూలతో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను నీరవ్ మోదీ మోసగించిన విషయం తెలిసిందే.దర్యాప్తులో భాగంగా నీరవ్ ఆస్తుల్ని ఈడీ స్వాధీనం చేసుకుంది.2018 డిసెంబర్‌లో నీరవ్ తమ దేశంలోనే నివసిస్తున్నాడని బ్రిటన్ ప్రభుత్వం భారత్‌కు తెలియజేసింది.మరోవైపు విజయ్ మాల్యా భారత్‌లో రూ.9వేల కోట్ల మేరకు బ్యాంకు రుణం ఎగవేశాడు.లిక్కర్ కింగ్ విదేశాల్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేశాడని .. భారత్‌ను వీడి విదేశాలకు పారిపోయాడని సీబీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొన విషయం తెలిసిందే.