అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. శబరిమలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ మొత్తం 26 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. నవంబర్ 25, డిసెంబర్ 2, 9, 16 తేదీల్లో మచిలీపట్నం – కొల్లాం మధ్య (రైలు నం.07145) ; నవంబర్ 20, 27, డిసెంబర్ 4, 11, 18 మధ్య కొల్లాం- మచిలీపట్నం (రైలు నం.07146) మొత్తం 10 సర్వీసులు నడుపుతున్నట్లు వెల్లడించింది.
SCR runs Sabarimala special trains @drmvijayawada pic.twitter.com/0cMZZdk2dt
— South Central Railway (@SCRailwayIndia) November 19, 2024