చైనా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో భారత యువ షట్లర్ అనుపమ ఉపాధ్యాయ శుభారంభం చేసింది. తనకంటే మెరుగైన ర్యాంకర్ పై విజయంతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో అనుపమ 21-17, 8-21, 22-20తో 15వ ర్యాంకర్ అమెరికాకు చెందిన బీవెన్ జాంగ్ పై గెలిచింది. ప్రపంచ ర్యాంకింగ్స్ లో 50వ స్థానంలో ఉన్న అనుపమ 48 నిమిషాల్లో ప్రత్యర్థిపై గెలిచి అదరగొట్టింది.
మరో మ్యాచ్లో ఆకర్షి కశ్యప్ 10-21, 18-21తో జపాన్ కు చెందిన తొమొక మియజాకి చేతిలో పరాజయం చెందింది. మిక్స్డ్ డబుల్స్ సుమీత్ రెడ్డి- సిక్కిరెడ్డి ద్వయం ప్రిక్వార్టర్స్ చేరుకుంది. తొలి రౌండ్లో సుమీత్- సిక్కి జోడీ 23-21, 17-21, 21-17తో అమెరికా జోడీ ప్రెస్లీ స్మిత్- జెనీ పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రియాన్షు రజావత్ 24-22, 13-21, 18-21తో ఇండోనేషియాకు చెందిన చికో వార్డోయో చేతిలో ఓటమి చెందాడు.
చైనా మాస్టర్స్ ప్రపంచ టూర్:తనకన్నా మెరుగైన ర్యాంకర్ పై గెలిచి సత్తా చాటిన అనుపమ
By admin1 Min Read
Previous Articleబాత్‌రూమ్‌లో కూర్చొని ఏడ్చేవాడిని: బాలీవుడ్ బాద్‌షా
Next Article ఆద్యంతం జోరు కొనసాగిస్తూ ఫైనల్ చేరిన భారత్