తన సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయినప్పుడు తాను ఏడ్చానని బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ తెలిపారు.తాజాగా జరిగిన సమిట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.’ఒకానొక సమయంలో.. నా సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం అందుకోకపోవడంతో బాత్‌రూమ్ కూర్చొని ఏడ్చేవాడిని.ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడేవాడిని.మళ్లీ ఆ బాధ నుంచి నేనే బయటకు వచ్చా.ప్రపంచం మనకు వ్యతిరేకం కాదు.ఎవరి కుట్ర వల్లనో నా సినిమాలు ఆడకపోవడం కాదు.. నేనే ప్రేక్షకులకు కనెక్ట్‌కాలేకపోయా.ఇది నా తప్పే అని గ్రహించనని తెలిపారు.
సమస్యలు ఎదురైనప్పుడు ఇతరులను నిందించవద్దన్నారు.నాకే ఇలా జరుగుతుందని బాధపడొద్దు.వాటి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుని విజయాలు అందుకోవాలని తెలిపారు. పఠాన్‌కు ముందు షారుక్ వరుస పరాజయాలు అందుకున్న విషయం తెలిసిందే.జీరో, ఫ్యాన్, రాయిస్ వంటి సినిమాలు అట్లర్ ఫ్లాప్ అయ్యాయి.