గత పాలకులు రక్షిత తాగునీరు సరఫరాపై కనీస శ్రద్ధ చూపలేదని డిప్యూటీ సీఎం పవన్ విమర్శించారు. ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఫిల్టర్ బెడ్లు మార్చలేకపోయిందని గ్రామానికి రూ.4 లక్షలు ఖర్చు చేయలేకపోయిందని ఆక్షేపించారు. ప్రతి ఇంటికీ రక్షిత తాగు నీరు సరఫరా కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రజలకు స్వచ్చమైన నీరు అందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టామన్నారు. ఇటీవల పల్లె పండుగ కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తమ నియోజకవర్గంలో రంగు మారిన నీటి సరఫరా సమస్యను డిప్యూటీ సీఎం దృష్టికి తెచ్చారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులను ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా అక్కడ చర్యలకు ఉపక్రమించి నీటి పరీక్షలు నిర్వహించి గ్రామాల్లో ఫిల్టర్ బెడ్స్ మార్చారు. రూ.3.3 కోట్లు నిధులు ఇందుకు వ్యయం చేశారు. ఈ క్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజ, ఆర్.డబ్ల్యూ.ఎస్. ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా గుడివాడ నియోజకవర్గం వలివర్తిపాడు గ్రామంలో నిర్వహణ పనులకు ముందు, తరవాత ఉన్న జలాల శాంపిళ్లను చూశారు. గుడివాడ నియోజకవర్గంలో మనం చేసిన విధానాన్ని ఒక మోడల్ గా తీసుకోవాలని సూచించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు