తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొంతమంది నెటిజన్లు ఇచ్చే రివ్యూలు సినిమా ఫలితంపై ప్రభావం చూపుతున్నాయని వాటిని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈమేరకు ఎక్స్ వేదికగా నేడు పోస్ట్ పెట్టింది.
ఈ సంవత్సరం విడుదలైన చాలా చిత్రాలపై రివ్యూలు ప్రభావం చూపించాయని ముఖ్యంగా ‘ఇండియన్ 2’, ‘వేట్టయన్’, ‘కంగువా’ చిత్ర ఫలితాలపై పబ్లిక్ టాక్, యూట్యూబ్ ఛానల్స్ ఇచ్చే విశ్లేషణలు ఎంతో ప్రభావం చూపిందని చిత్ర పరిశ్రమకు రానురాను ఇదొక సమస్యగా మారుతోందని దీనిని కట్టడి చేసేందుకు పరిశ్రమలోని అన్ని సంఘాలు ఏకం కావాలని సూచించింది. పరిశ్రమ అభివృద్ధికి అందరూ కలిసి కృషి చేయాలి. ఇందులో భాగంగా థియేటర్ యజమానులు యూట్యూబ్ ఛానల్స్ ను సినిమా హాళ్ల ప్రాంగణంలోకి అనుమతించకూడదని పేర్కొంది.
మొదటి రోజు మొదటి షో సమయంలో థియేటర్ వద్ద పబ్లిక్ రివ్యూలకు అవకాశం కల్పించకూడదని అదే విధంగా రివ్యూల పేరుతో నటీనటులు, దర్శక నిర్మాతలపై వ్యక్తిగత విమర్శలను ఖండిస్తున్నట్లు తెలిపింది. ఇక మీదట అలాంటివాటికి పాల్పడితే అంగీకరించేది లేదని పేర్కొంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు