గత వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా, వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వం రెన్యువల్ చేయలేదని తెలిపారు. గత ప్రభుత్వ చర్యల కారణంగా ఆ వ్యవస్థ మనుగడలో లేదన్నారు.
వాలంటీర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి తాము ప్రయత్నించినట్లు వివరించారు. అయితే ఆ వ్యవస్థ లేదని ఇంకా లేని ఉద్యోగులకు వేతనాలు ఎలా చెల్లించాలి? అని ప్రశ్నించారు. వాళ్లు విధుల్లో ఉంటే కొనసాగించే వాళ్లమని ఆయన పేర్కొన్నారు. గతేడాది ఆగస్టు నుండి వాలంటీర్ల వ్యవస్థ ఉనికిలో లేదు. వారికి సంబంధించి గత ప్రభుత్వం జీవోలు ఇవ్వలేదని తెలిపారు. గత ప్రభుత్వం జీవో ఇచ్చి ఉంటే కొనసాగించి వేతనాలు పెంచేవాళ్లమని చెప్పారు. మే నెల వరకు వాలంటీర్లకు వేతనాలు చెల్లించినట్లు వెల్లడించారు. ఆ వ్యవస్థపై తమకు విశ్వాసం ఉందని డోలా బాలవీరాంజనేయస్వామి తెలిపారు.
వాలంటీర్ వ్యవస్థ ఉంటే కొనసాగించేవాళ్లం: మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి
By admin1 Min Read
Previous Articleతమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం
Next Article పెళ్లి చేసుకోవాలని లేదు: ఐశ్వర్య లక్ష్మి