ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నేడు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రి వర్గ సమావేశంలో ఏపీ టూరిజం పాలసీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.2024- 25 నూతన క్రీడా పాలసీకి ఆమోదం లభించింది. పర్యాటక ప్రాజెక్టులకు పరిశ్రమ హోదా కల్పించే ప్రతిపాదనను చర్చించి ఆమోదించింది. జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో స్థానిక సంస్థల్లో చైర్మన్లపై అవిశ్వాసం పెట్టే అంశంపై చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అవిశ్వాసం పెట్టే గడువును నాలుగేళ్ల నుండి రెండు సంవత్సరాలకు కుదిస్తూ చట్ట సవరణ చేశారు.
డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పేరును ఎలైట్ యాంటీ నార్కటిక్ గ్రూప్(ఈగల్) మారుస్తూ క్యాబినెట్ తీర్మానించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కోసం గృహ నిర్మాణ శాఖ చేసుకోనున్న ఒప్పందానికి క్యాబినెట్ ఆమోదం లభించింది. ఏపీ టవర్స్ లిమిటెడ్ ను ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ లో విలీనం చేసేందుకు క్యాబినెట్ ఆమోదం. ఏపీ టవర్స్ లిమిటెడ్ కు చెందిన మూలధనం, ఆస్తులు, అప్పులు బదలాయిస్తూ ప్రతిపాదన చేశారు. ఏపీ ఇన్ఫ్రా ట్రాన్స్పరెన్సీ యాక్ట్ 2019 రిపీట్ చేయాలని ప్రతిపాదించింది.
Previous Articleసమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం: డిప్యూటీ సీఎంకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ధన్యవాదాలు
Next Article సంక్రాంతికి పెరిగిన పోటీ.. బరిలోకి వెంకీ మామా