55వ భారతీయ అంతర్జాతీయ సినిమా వేడుక గోవా వేదికగా ఘనంగా ప్రారంభమైంది. రాజధాని నగరం పనాజీ లోని డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, సహాయమంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ వీడియో సందేశాల ద్వారా కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ వేదికపై భారత చలనచిత్ర రంగ ప్రముఖులు అక్కినేని నాగేశ్వరరావు, రాజ్ కపూర్, మహమ్మద్ రఫీ, తపన్ సిన్హాల శత జయంతుల సందర్భంగా వారికి నివాళులు ఘనంగా నివాళులర్పించారు. ఈ నలుగురి పేరిట స్మారక పోస్టల్ స్టాంపులను విడుదల చేశారు. ప్రముఖ సీనియర్ తెలుగు నటుడు నాగార్జున, బాలీవుడ్ దర్శకుడు శేఖరకపూర్, ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
Previous Article‘కాగ్’ అధిపతిగా సంజయ్ మూర్తి ప్రమాణస్వీకారం
Next Article అదానీపై కేసు.. కాంగ్రెస్ ఏమందంటే..?