లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.దీనిపై తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.అదానీ వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ మేరకు పార్టీ కార్యాలయంలో విలేకర్లతో ఆయన మాట్లాడారు.మోదీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు.
అమెరికా,భారత చట్టాలను అదానీ ఉల్లంఘించారనే విషయంపై ఇప్పుడు స్పష్టత వచ్చిందని రాహుల్ గాంధీ అన్నారు.మోదీ,అదానీల బంధం భారత్‌లో ఉన్నంత వరకే సురక్షితమన్నారు.