చైనా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లాడు. తాజాగా జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ లో లక్ష్యసేన్ 21-16, 21-18తో డెన్మార్క్ కు చెందిన రస్ ముస్ గెమ్కీ పై విజయం సాధించాడు.
క్వార్టర్ ఫైనల్ లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ:
పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్ ఫైనల్ లో అడుగుపెట్టింది. ప్రిక్వార్టర్స్ లో ఆరో సీడ్ సాత్విక్ జంట 21-19, 21-15తో డెన్మార్క్ జోడి రసమ్ముస్ జేయర్- ఫ్రెడెరిక్ సోగార్డ్ ను ఓడించి సత్తా చాటింది.
పి.వి.సింధు ఓటమి:
ఇక మరో స్టార్ షట్లర్ పి..వి.సింధు టోర్నీ నుండి నిష్క్రమించింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ లో సింధు 16-21, 21-17, 21-23తో సింగపూర్ క్రీడాకారిణి యెవో జియా మిన్ చేతిలో పరాజయం చవిచూసింది.
మిగతా మ్యాచ్ లలో అనుపమ ఉపాధ్యాయ 7-21, 14-21తో జపాన్ క్రీడాకారిణి నత్సుకి నిదైరా చేతిలో, మాళవిక బాన్సోద్ 9-21, 9-21తో థాయ్ లాండ్ కు చెందిన సుపనిద చేతిలో ఓడారు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో గాయత్రి గోపీచంద్- ట్రీసా జాలీ జోడీ 16-21, 11-21తో చైనా ద్వయం షెంగ్ షు- టాన్ నింగ్ జంట చేతిలో ఓటమి చెందింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు