భారత్, ఆస్ట్రేలియా దేశాలు అంతరిక్ష అంశాలకు సంబంధించి పరస్పర సహకారం అందించుకునే వైపు మరింత పటిష్టంగా అడుగులు వేయనున్నాయి. ఇందుకోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), ఆస్ట్రేలియా అంతరిక్ష సంస్థ (ఏఎస్ఏ) తాజాగా ‘అమలు ఒప్పందం’ కుదుర్చుకున్నాయి. భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్ యాన్’కు ఆస్ట్రేలియా సహకరించేందుకు ఇది వీలు కల్పిస్తుంది. గగన్ యాన్ కు సంబంధించి క్రూ, క్రూ మాడ్యూల్ రికవరీ మిషన్లలో ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ చేయూత అందించేందుకు దోహదపడుతుంది.
భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్ యాన్’కు ఆస్ట్రేలియా సహకారం
By admin1 Min Read