సినిమాకు, సంగీతానికి భాషా భేదం లేదు ప్రాంతీయ బేధం లేదు. భావోద్వేగాలు అనే విశ్వ భాష ద్వారా సరిహద్దులను దాటి అందరినీ ఏకం చేయగల ప్రత్యేక శక్తి వీటికి ఉంది.
తాజాగా ప్రారంభమైన 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ‘బెటర్ మాన్’ అనే సినిమాతో ప్రారంభమైంది. మైకేల్ గ్రేసీ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం బ్రిటిష్ పాప్ దిగ్గజం రాబీ విలియమ్స్ అసాధారణ జీవితానికి, అతని ఖ్యాతికి అద్దం పట్టే విధంగా తెరకెక్కింది. ఈ చిత్ర నటీనటులు మరియు సిబ్బంది సినిమా ప్రదర్శనకు ముందు రెడ్ కార్పెట్‌పై నడిచారు. ‘బెటర్ మాన్’ తొలిసారి టెల్యురైడ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది మరియు 2024 సెప్టెంబర్ 10న టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ప్రదర్శించబడింది.ఈనెల 20న ప్రారంభమైన 55వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రారంభచిత్రంగా ప్రదర్శించారు. ఈ ఏడాది డిసెంబర్ 26న ఆస్ట్రేలియాలో థియేటర్లలో విడుదల కానుంది. అంతకంటే ఒక రోజు ముందు, 2024 డిసెంబర్ 25న, అమెరికాలో పరిమిత థియేట్రికల్ విడుదల ఉంటుందని, తరువాత 2025 జనవరి 17న విస్తృత విడుదల చేయనున్నట్లు సమాచారం.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు